హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై లయన్ ఆరిగపూడి విజయ్‌కుమార్ సమర్పణలో ప్రతాప్ భీమవరపు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రానికి తాను నిర్మాతనని లయన్ శ్రీరామ్ దత్తి ప్రకటించుకుంటున్నారని, అయితే ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు తానేనని, ఛాంబర్‌లో తనపేరునే రిజిస్టర్ అయిందని, ‘ఓ తండ్రి తీర్పు’ టైటిల్, ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ కూడా తన పేరుపైనే రిజిస్టర్ అయి ఉందని, యూనిట్‌లోని కొందరు స్వార్ధపరులు సినిమాకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లను దొంగిలించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన (ఛాంబర్‌లో బ్యానర్ రిజిస్ట్రేషన్ పత్రాలు, టైటిల్ రిజిస్ట్రేషన్) పత్రాలను మీడియాకు అందజేశారు.
తనకు తెలియకుండానే హార్డ్‌డిస్క్‌లను దొంగిలించి వాటి ఆధారంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను బిజినెస్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, కావున ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపినా తనకు సంబంధం లేదని, ఈ విషయమై న్యాయపరమైన చర్యలకు కూడా ఇప్పటికే ఉపక్రమించినట్టు ఆయన తెలియజేశారు. తాను రచించిన ‘ఓ తండ్రి తీర్పు’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని, ఈ పుస్తకాన్ని గత సంవత్సరం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి గారి చేతుల మీదుగా ఆవిష్కరించామని పేర్కొన్నారు. తనకు సన్నిహితులైన లయన్ అరిగపూడి విజయ్‌కుమార్ గారు తన కథ నచ్చడంతో ఆయన సమర్పణలో సినిమాగా రూపొందించడానికి సిద్ధపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతను తానేనని, మరెవరికీ దీనిపై హక్కులు లేవని ఆయన వెల్లడిరచారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్