telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువ పాప్‌స్టార్‌ అనుమాస్పద మృతి

Yohan

కొరియన్‌ యువ పాప్‌స్టార్‌ అకస్మాత్తుగా చనిపోయాడు. పాప్ స్టార్ యొహాన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టీఎస్‌టీ (టాప్‌ సీక్రెట్‌ బ్యాండ్‌) మెంబర్‌ అయిన 28 ఏళ్ల యొహాన్‌ జూన్‌ 16న చనిపోయినట్లు కేజే ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వెల్లడించింది. అయితే యొహాన్‌ మృతికి గల కారణాలపై ఎలాంటి పుకార్లు సృష్టించొద్దని సంస్థ అతడి అభిమానులను కోరింది. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్లకు కూడా రిక్వెస్ట్ చేసింది. యొహాన్‌ కుటుంబం ప్రస్తుతం విషాదంలో ఉందని తెలిపింది. యొహాన్‌ ఆకస్మిక మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది… దయచేసి యొహాన్‌పై ఉన్న గౌరవంతో అతని మృతిపై సంయమనం పాటించాలని అతని కుటుంబ సభ్యుడొకరు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన ఆల్బమ్స్‌తో అందరినీ ఆకట్టుకున్న యొహాన్‌ ఇలా హఠాన్మరణం చెందడంతో కొరియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. యొహాన్‌ మృతిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యోహాన్ వయసు 28 ఏళ్లు. గత కొన్ని నెలలుగా అతగు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇనస్టాగ్రామ్‌లో మే 31న తన చివరి పోస్టు పెట్టాడు. బీచ్ దగ్గర దిగిన ఫోటోను షేర్ చేశాడు. దానికి ‘ ఐ వాంట్ టు ట్రావెల్’ అన్న కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టు వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

여행가고 싶다✈

A post shared by 김요한 (@yohanee0416) on

Related posts