telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడిపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు

Payal

బిగ్‌బాస్ హిందీ ఎక్స్‌కంటెస్టెంట్ పాయల్ రోహ్తగీ కాస్టింగ్ కౌచ్ అంశాన్ని లేవనెత్తారు. బాలీవుడ్ డైరెక్టర్ దివాకర్ బెనర్జీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు ఒక సినిమాలో ఆఫర్ ఇప్పిస్తానంటూ వేధించాడని పేర్కొన్నారు. 2011లో ఆ డైరెర్టర్ తనను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని మెసేజ్ పంపించాడన్నారు. తరువాత తనతో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడన్నారు. దీంతో తనకు మెంటర్ దొరికాడని సంతోషించానన్నారు. ఈ సమయంలో తనకు, రాహుల్ మహాజన్‌కు ఉన్న సంబంధంపై కూడా చర్చ జరిగిందన్నారు. తరువాత అతని సినిమా ‘షాంగై’లో పాత్ర ఇస్తానని చెప్పినప్పటి నుంచి సమస్య మొదలయ్యిందన్నారు. తన ఇంటికి వచ్చి, బరువు పెరిగిపోతున్నానని చెప్పి, షర్టు ఎత్తి పొట్ట చూపించాలని కోరాడన్నారు. అయితే నేను దానికి అంగీకరించలేదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పానని తెలిపారు. అప్పటి నుంచి దివాకర్ తనకు దూరంగా ఉంటున్నాడని పాయల్ తెలిపారు.

Related posts