telugu navyamedia
సినిమా వార్తలు

ఘ‌నంగా ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్ళి.. వైరల్ అవుతోన్న పిక్స్..

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 5 సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

గురువారం(ఏప్రిల్‌14)న బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, కరణ్‌ జోహార్‌, ఆకాష్‌ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధించిన కొన్నిపెళ్లి ఫోటోలను ఆమె తాజాగా  సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలు షేర్‌ చేసిన కాసేపటికే ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..

 ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైయ్యారు. వారి వివాహం ఈరోజు అంటే ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ బాంద్రాలోని ఇల్లు వాస్తులో జరిగింది. వీరి వివాహానికి నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్ తదితరులు హాజరయ్యారు. ఈ ఇద్దరూ రాత్రి 7 గంటల తర్వాత మీడియా ముందు భార్యాభర్తలుగా కనిపించనున్నారు. Photo : Twitter

వీరిద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారో..ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో కొత్తజంటకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

 అక్కడ ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తారు.. కానీ ఇక్కడ పది రోజులకే 5 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. పారితోషకం ఎక్కువైనా పర్లేదు కానీ బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న కోరడంతో నిర్మాత కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. (Image: Instagram)

Related posts