telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన విజయ్ సేతుపతి

Vijay-Sethupathi

“తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా “ఉప్పెన” సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటారు విజయ్ సేతుపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి వాతావరణ కాలుష్యం తగ్గడం కోసం మొక్కలు నాటిస్తున్నారు. అందులో నేను కూడా మొక్కలు నాటి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందరికి కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Related posts