telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

రానున్న రెండు రోజులలో.. ఏపీలో తీవ్ర వడగాల్పులు.. జాగర్తగా ఉండాలన్న అధికారులు..

ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా తెలుస్తుంది. రోజు పగటి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రేపు, ఎల్లుండి పగటి ఉష్ణోగ్రత భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత పెరగడంతో పాటు బలమైన వడగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ విషయమై వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈరోజు ఏపీలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 23 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని చెప్పారు.

రేపు ముఖ్యంగా రాయలసీమలో వడగాలులు వీస్తాయని ఆయన హెచ్చరించారు. ఎల్లుండి అంటే గురువారం ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు.

Related posts