telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విక్రమ్ “కోబ్రా”లో స్టార్ క్రికెటర్

Cobra

విల‌క్ష‌ణ నటుడు చియాన్ విక్ర‌మ్ ప్ర‌స్తుతం “కోబ్రా” సినిమాలో నటిస్తున్నాడు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ భారత స్టార్ క్రికెటర్ నటిస్తున్నట్లు అజయ్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అజయ్‌ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్ర ఉంది. అది సినిమాలో చాలా ముఖ్యమైంది. అయితే ఈ పాత్రలో నటించడానికి భారత మాజీ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గ్రీన్ సిగ్నల్ ” ఇచ్చారని తెలిపాడు. ఇక ఇంతకుముందు కూడా ఈ సినిమాలో విక్రమ్ నీటిలో తలకిందులుగా వేలాడే సీన్ గురించి అజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు ఇరవై గెటప్ లలో కనిపించనున్నట్లు సమాచారం.  గ‌త కొంత కాలంగా విక్ర‌మ్ త‌న స్థాయి విజ‌యాల్ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. 

Related posts