టాలీవుడ్ స్టార్ జోడి నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి అని ఒక పోస్ట్ చేశాడు. ఆపై మరొక పోస్ట్‌లో ‘మనసు అనేది ఆలోచనల పుట్ట.. మన వెళ్లే మార్గాని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ వెంకీ తన ఇన్‌స్టా స్టోరీలో వరుస పోస్ట్‌లు పెట్టాడు. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
సమంత, చైతన్య నిర్ణయంపై తాజాగా సమంత తండ్రి స్పందించారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది, ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు వివరించారు.
అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!