telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నివర్ బాధితులకు జగన్ శుభవార్త…

cm jagan ycp

ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. నివర్ తుఫాన్‌ ప్రభావాన్ని, జరిగిన నష్టాన్ని కేబినెట్‌కు వివరించారు అధికారులు… సుమారు 40 వేల హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేయగా… రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందినట్టు వెల్లడించారు. అయితే, పంట నష్టాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. డిసెంబర్‌ నెలాఖరులోగా నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు.. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచించిన ఆయన.. ఎన్జీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి నిబంధనల మేరకు ఆర్ధిక సాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. కడప జిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు, ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రాజధాని స్టార్టప్ ప్రాజెక్టుల రద్దు, అమరావతి డెవలప్మెంట్ పార్థనర్స్ (ఏడీపీ) లిక్విడెషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది కేబినెట్.

Related posts