telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వివేకా హత్య కేసు : ఏపీసీఎం ఆ వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నారో తేల్చాలి.. సునీతారెడ్డి

viveka daughter with media

ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తన తండ్రి వివేకా హత్య వెనుక ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు.. ఈ హత్యా కుట్ర వెనుక ఆదినారాయణ హస్తం ఉందన్న అనుమానాలు తమకు ఉన్నాయని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, హత్యకు సంబంధముందని సిట్ భావిస్తున్న వారిలో పలువురికి ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. తాను చెప్పినట్టుగా పని చేస్తున్నారు కాబట్టే ఆదినారాయణ రెడ్డిని బాబు కాపాడుకుంటూ వస్తున్నారా? అని ప్రశ్నించారు.

తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని ఆమె అన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, హత్య జరిగిన వెంటనే అక్కడ చేయాల్సిన తన విధులను సీఐ చేయలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన చూస్తుండి పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు తమను ఎన్నో ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సమాధానం ఇచ్చామని చెప్పిన ఆమె, తాను స్వయంగా ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఆయన్ను విచారించలేదని, సిట్ సైతం టీడీపీ అధీనంలోనే పనిచేస్తోందని ఆరోపించారు.

ఇటీవల వివేకా సతీమణి సిబిఐ లేదా మరో మూడో దర్యాప్తు సంస్థ తో హత్య పై విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దానిని విచారించిన కోర్టు ఎన్నికల వరకు సిట్ ఎటువంటి ప్రెస్ మీట్ ఇవ్వరాదని ఆదేశాలు జారీచేసింది.

Related posts