రైల్వే, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్‌లపై ప్రధాని మోదీ ఫోటోలను ఎందుకు తొలగించలేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు శాఖలను ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల సంఘం రైల్వేశాఖ, పౌర విమానయాన శాఖలకు లేఖలు రాసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. అయితే ఈ అంశాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయా మంత్రిత్వ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ప్రధాని మోదీ ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వరంగ ఎయిరిండియా ప్రకటించింది. నేతల ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లపై పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ట్విట్టర్‌లో అభ్యంతరం తెలిపారు.
previous post
అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు