telugu navyamedia
రాజకీయ

రాహులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాలి..

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్‌ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్‌ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ప‌ట్టుబ‌ట్టారు.

అయితే, ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాహుల్​.. తాజాగా జరిగిన భేటీలో ‘అధ్యక్ష పదవి గురించి ఆలోచిస్తాను’ అని వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల స్పందనపై ఆనందాన్ని వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ఇదే అభిమానాన్ని తనపై కొనసాగించాలని వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

కాగా..2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ​. ఆ తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే రాహుల్​ తిరిగి పదవిని చేపట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Rahul gandhi: రాహులే అధ్యక్షుడు కావాలి.. అందరి ఆకాంక్షా అదే!

అలాగే..ఇవాళ జ‌రిగిన సిడబ్ల్యుసి స‌మావేశ‌ నిర్ణయాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణు గోపాల్ మీడియాతో మాట్లాడారు..2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప‌ట్ట‌నున్నారు. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేయ‌నున్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 20 వ‌ర‌కు పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు విడుత‌ల వారీగా జ‌రుగ‌నున్నాయి.

Related posts