telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఆమంచి జగన్‌తో భేటీ వాయిదా..చంద్రబాబు ను కలిసే అవకాశం!

Amanchi Krishna Mohan,Ysrcp
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల  ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ఆమంచి కృష్ణమోహన్ బాబుకు వివరించనున్నారు. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్  పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై  కూడ పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడ అన్వేషిస్తున్నారు. స్థానికంగా పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ రోజు జగన్‌తో భేటీని ఆమంచి వాయిదా వేసుకొన్నారు. 
మంగళవారం  చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో తన అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్‌ భేటీ అయ్యారు. టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆమంచి  తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.  కార్యకర్తలతో సమావేశమైన విషయాన్ని తెలుసుకొన్న మంత్రి శిద్దా రాఘవరావు  మంగళవారం సాయంత్రం ఆమంచి కృష్ణమోహన్‌తో భేటీ అయ్యారు. వాస్తవానికి  బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో ఆమంచి కృష్ణమోమన్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ, మంత్రి శిద్దా రాఘవరావు చొరవతో ఆమంచి వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

Related posts