telugu navyamedia
సినిమా వార్తలు

మోహ‌న్‌బాబు కోపం ఆయనకే ఎంతో న‌ష్టం చేసింది..

‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..‘‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు లాంటి యువకుడిని, అతని ప్యానెల్‌ని ఎన్నుకున్న ‘మా’ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మంత్రి అభినందనలు తెలిపారు.

ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో విష్ణుకి మోహన్‌బాబు నేర్పించారు. క్రమశిక్షణ అలవర్చారు. అలాగే, సుమారు 25 సంవత్సరాల నుంచి మోహన్‌బాబుకీ, నాకూ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. మోహన్‌బాబుకి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. ఆ విషయం ఆయన మనసుకు కూడా తెలుసు. సమాజ హితం కోసమే ఆయన మాట్లాడతారు. వ్యక్తిగత లాభం కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. మంచి వ్యక్తులను ‘మా’ సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది.

MAA Elections: వ్యక్తిగత లాభం కోసం మోహన్‌బాబు ఎప్పుడూ మాట్లాడలేదు: తలసాని - telugu news talasani srinivas yadav speech at manchu vishnu oath

హైదరాబాద్‌ సినీ హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించినట్లు తలసాని తెలిపారు. విష్ణుకి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తామ అన్నారు. “తెలంగాణలో అద్భుతమైన కళాఖండాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తెలంగాణలో షూటింగ్‌లకు అనువైన వాతావరణం ఉందని. రామోజీ ఫిలింసిటీ హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణం. . ప్రపంచంలోనే అద్భుతమైన ఈ కళాఖండాన్ని రామోజీరావు ఇక్కడ సృష్టించారు. థియేటర్లలోనే సినిమాలు చూడాలని ప్రేక్షకులను కోరుతున్నా. సినీ ప్రముఖులు ఐక్యంగా ఉంటే ‘మా’లో సమస్యలే ఉండవు” , అందరూ సమిష్టిగా మా ను ముందుకు తీసుకెళ్లండి. మీ వెంట మేము ఉంటాము. అర్హులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తాం అని తలసాని అన్నారు.

Related posts