telugu navyamedia
రాజకీయ వార్తలు

 పిటిషన్ ను ఎందుకు వేశారో.. అరగంట చదివినా అర్థం కాలేదు: రంజన్ గొగోయ్

Supreme Court

జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉదయం పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ పిటిషన్ ను అరగంటపాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని గొగోయ్ స్పష్టం చేశారు.

మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.

Related posts