టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కాల్, డేటా రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కోల్‌కతాలో తాజాగా ముగిసిన 5వ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్)లో పాల్గొన్న భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రాజన్ భారతి మిట్టల్ మాట్లాడుతూ.. ప్లాన్ల ధరలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయని కాబట్టి భవిష్యత్తులో కాల్, డేటా చార్జీలను తగ్గించే ఆలోచన లేదన్నారు. ధరల విషయంలో ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని, మార్కెట్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అది జరుగుతుందనే అనుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే, ధరలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు.
previous post