telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలుకు భారతరత్న ఇవ్వాలి : మురళీమోహన్

SPB

పద్మశ్రీ డా. బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని ప్రముఖ సినీ నటులు, నిర్మాత, పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి మురళీమోహన్ కోరారు. వంశీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక సభ నిర్వహించారు. అమెరికా హ్యూస్టన్ నగరానికి చెందిన ప్రముఖ గాయని, బాలుకు అత్యంత్య ఆప్తురాలైన శారద ఆకునూరి తమ గృహంలో బాలుగారిచిత్రపటాన్ని ఏర్పాటు చేసి జ్యోతి ప్రకాశనం చేశారు. 

Balu

ఈ సభలో గానకోకిల శారద ఆకునూరి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలుకు భారతరత్న ఇవ్వాలని భర్త ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సంస్థలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని, 16 భాషలలో కొన్ని వందల చిత్రాలకు, 40,000 పాటలను పడడమే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడుగా, డబ్బింగ్ కళాకారుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిన బాలు “పాడుతా తీయగా” ద్వారా ఎంతోమంది యువగాయనీ గాయకులను తీర్చిదిద్దారని అన్నారు.

Balu

ఈ సభలో వంశీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డా. వంశీరామరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంతర్జాలంలో 74 రోజులపాటు ఎస్పీ బాలు సంగీతోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాభారతి డాక్టర్ జమునా రమణారావు, సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు, నేపథ్య గాయని జమునారాణి, సంగీత్ దర్శకుడు మాధవపెద్ది సురేష్, వీణాపాణి, కేఎం రాధాకృష్ణ, సినీ రచయితలు భువనచంద్ర, వెన్నెలకంటి, వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ నగేష్ చెన్నుపాటి, ప్రవాస భారతీయులు, తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాళ్లూరి, నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే, టాటా భరత్ మందాడి, యస్ నరేంద్ర, ఆళ్ళ శ్రీనివాస్, మ్యూజిక్ వరల్డ్ రాజేష్ తదితరులు పాల్గొని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ఘన నివాళులర్పించారు.

Related posts