ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త వైరస్ వివాదం ముదురుతోంది. ఏపీలో కొత్త వైరస్ ఉందని టిడిపి అంటుంటే.. వైసీపీ సర్కార్ వాటిని కొట్టిపారేస్తోంది. ఈ వివాదం కేసుల వరకు పోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కు షాక్ తగలనుంది. చంద్రబాబుకు ఇవాళ నోటీసులు ఇవ్వనున్నారు కర్నూలు పోలీసులు. హైదరాబాద్‍లో చంద్రబాబుకు నోటీసులిస్తామన్న కర్నూలు ఎస్పీ పక్కిరప్ప… ఎన్-440కే వేరియంట్‍పై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచిస్తామన్న ఎస్పీ పక్కీరప్ప.. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు.
previous post