telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్ అంబులెన్సు : 102 లో కెప్టెన్ ఉద్యోగాలకు .. ఇంటర్వ్యూలు.. త్వరపడాలి..

interviews for captain jobs in 102

ఈ నెల 13వ తేదీన జీవీకే, ఈఎంఆర్‌ఐలోని 102 కెప్టెన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణలయ్యి, ఎల్‌ఎంవీ విత్ ట్రాన్స్‌ఫోర్ట్ బ్యాడ్జ్ లైసెన్స్, హెచ్‌టీవీ లైసెన్స్ కలిగి ఉండి, డ్రైవింగ్‌లో మూడేండ్ల అనుభవం, వయస్సు 22-35 ఏండ్లు, ఎత్తు 5 .4 అంగులములు, తెలుగు, ఇంగ్లీష్‌లో చదవడం, రాయడం వచ్చి, కలర్ బ్లైండ్‌నెస్ లేని వారు అర్హులని తెలిపారు.

ఎంపికైన వారు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, మొత్తం 12 గంటల పాటు పనిచేయాల్సి ఉం టుందని, జీవీకే ఈఎంఆర్‌ఐ 108 ఆఫీస్ కింగ్‌కోఠి దవాఖానలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాల కోసం 77021 22533 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Related posts