telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.144 శాతం మేర పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజా పెరుగుదలతో ఉద్యోగి మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెరిగినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 జనవరి 1 నుంచి డీఏ పెంపుదల ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి డీఏ పెంపుదల వర్తిస్తుంది. జులై 2021 వేతనంతో పెంచిన డీఏను చెల్లించనున్నారు. 2019 జనవరి 1 నుంచి డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో 2021 జులై నుంచి చెల్లించనున్నారు.

Related posts