telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజని పాత్రలో లారెన్స్

rajani

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పి.వాసు దర్శకత్వంలో 2005లో విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ప్రకటించారు. ఈ సినిమాకు కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోందని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘తలైవా అంగీకారం, ఆశీర్వాదంతో ‘చంద్రముఖి 2’ సినిమాలో నటించనుండటం నా అదృష్టం. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. నా లక్కీ ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్ కళైనిధి మారన్ సార్ నిర్మిస్తున్నారని లారెన్స్ వెల్లడించారు.

Related posts