ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ దాదాపు రెండు, మూడు సంవత్సరాలకు సరిపోయేలా సినిమాలను లైన్‌లో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వెంకీ కూడా అదే పంథాలో వెళుతున్నారు. వెంకీ ఇటీవల పూర్తి చేసిన సినిమా “నారప్ప”. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే వెంకీ తన తాజా చిత్రం “ఎఫ్3” ఓకే చేశారు. ప్రస్తుతం వెంకీ ఎఫ్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వెంకీ ఎఫ్3 లాంటి కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ తరువాత ఎవరి డైరెక్షన్‌లో చేస్తారన్నది హాట్ టాపిక్‌గా ఉంది. అయితే ఎఫ్3 తర్వాత వెంకీ చేసే సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సినిమా సగం పూర్తి అయిన తరువాత వెంకీ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. అది కచ్ఛితంగా వెంకీ తదుపరి సినిమా గురించే అని అభిమానులు భావిస్తున్నారు. అయితే వెంకీ, యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబో ఫైనల్ అయిన విషయం తెలిసిందే. ఈ కాంబోపై గత నాలుగేళ్లుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఇటీవల తరుణ్ భాస్కర్ వెంకీ నుండి పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ యువ దర్శకుడికి బడ్జెట్ విషయంలో లిమిట్ లేదని సురేష్ బాబు చెప్పారంట. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post