ముంబై, ఒషివారాలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఓ వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ యువతి పేరు పెర్ల్ పంజాబీ. వయసు పాతికేళ్లు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే తపనతో ఒక్క అవకాశం దక్కితే చాలు… టాలెంట్ నిరూపించుకుందామని అనుకుంది. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఆమె వెళ్లాలనుకోవడం ఆమె తల్లికి నచ్చకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకోమని తల్లి పదే పదే కోరేది. ఈ విషయంలో తల్లీ, కూతురి మధ్య గొడవలు కూడా అయ్యేవి. ఏవో చిన్నా చితకా కేరక్టర్లు తప్పితే తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదు ఆమెకు. ఎన్నో ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ ఆఫర్లు రాకపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. ఆఫర్లు రాకపోవడంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయిన పంజాబీ సూసైడ్ చేసుకోవడానికి పై నుంచీ దూకేసింది. వెంటనే ఆమెను కోకిలాబెన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చారు. పంజాబీ ఇదివరకు రెండుసార్లు వేర్వేరు రకాలుగా చనిపోవడానికి ప్రయత్నించి ఫెయిలైందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈసారి ఆమె చనిపోవడానికి కుటుంబ సభ్యులతో ముందు రోజు జరిగిన గొడవే కారణం కావొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !