telugu navyamedia
సినిమా వార్తలు

బట్టలు అమ్ముకుంటున్న బాహుబలి హీరోయిన్

Nora

తెలుగులో “బాహుబలి – ది బిగినింగ్”లో “మనోహరి” పాటకు నర్తించిన నోరా ఫతేహి “కిక్-2”, “ఊపిరి” తదితర చిత్రాల్లోనూ కనిపించింది. ఇటీవలే విడుదలైన “భారత్” సినిమాలో నోరా లాటిన్ అమెరికా యువతి పాత్రలో కనిపించింది. తాజాగా ఈ అమ్మడు బ్యాంకాక్‌లో దుస్తులు అమ్ముకుంటున్న వీడియో సంచలనంగా మారింది. బాలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా, నటిగా పేరు సంపాదించారు నోరా. అయితే తాజాగా బ్యాంకాక్ మార్కెట్‌లో నేల మీద కూర్చుని దుస్తులను విక్రయిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియోలో నోరా ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ఆమె ఏమాత్రం మేకప్ వేసుకోకపోయినా చాలా అందంగా కన్పిస్తోంది. ఆమె చుట్టూ కొన్ని దుస్తులు ఉన్నాయి. అక్కడ దుస్తులను విక్రయిస్తున్న నోరా వినియోగదారులతో స్థానిక భాషలోనే మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Related posts