telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీసీసీ పదవిపై క్లారిటీ ఇచ్చిన జీవన్ రెడ్డి

పీసీసీ పదవిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి వచ్చినా సామాన్య కార్యకర్త గానే పనిచేస్తానని.. నాకు ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష పదవి ఖరారు అయిందని ఎలాంటి సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నాకు సముచిత స్థానం కల్పించిందని.. పదవి వచ్చినా రాకపోయినా నేను పార్టీ బలోపేతం కోసం సామాన్య కార్యకర్త గానే పని చేస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తు మాత్రం కాంగ్రెస్ పార్టీదేనని.. పత్రికల్లో,టీవీల్లో వస్తున్నది మాత్రం ఊహాజనితం మాత్రమే అని తెలిపారు. తనకు మాత్రం పదవి గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదన్నారు. కాగా…టీపీసీసీ అధ్యక్ష నియామకం పై ఉత్కంఠ కొనసాగుతున్నది. పీసీసీ రేసులోకి తెరమీదకొచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు… ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు హస్తిన పెద్దలు. రేవంత్ ను కొందరు వ్యతిరేకిస్తుండటం తో మద్యే మార్గంగా సీనియర్ల పేర్లను పరిశీలిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. పరిశీలనలో జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి మరికొందరి పేర్లు.. అందరికీ ఆమోదయోగ్యమైన నేతలెవరన్న దాని పై అభిప్రాయాలు తీసుకుంటున్నది హైకమాండ్. రాష్ట్రానికి రహస్యంగా కాంగ్రెస్ అధిష్టానం దూతలు… పలువురు రాష్ట్ర నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Related posts