telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఏపీ : .. గడువు ముగిసిన డిగ్రీ విద్యావిధానం.. మార్పుకు తరుణం..

committee on new degree syllabus

యూజీసీ 2015-16 నుంచి డిగ్రీ కోర్సుల్లో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసి ఐదేళ్లపాటు అమలయ్యేలా గడువు నిర్దేశించింది. ఈ గడువు 2020 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీబీసీఎస్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సవరించి మరింతగా పటిష్టం చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు) మాజీ ఉపకులపతి ప్రొఫెసర్‌ జి.రాజారామిరెడ్డి చైర్మన్‌గా ఏడుగురు ఉన్నత విద్యారంగ నిపుణులతో ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కమిటీ చైర్మన్‌ జి.రాజారామిరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.కిషోర్‌బాబు(ఆంధ్రావర్సిటీ), ప్రొఫెసర్‌ కె.త్యాగరాజు(ఎస్వీ వర్సిటీ), డాక్టర్‌ జి.శ్రీరంగం మాథ్యూ(ఆంధ్రాలయోలా కాలేజీ, విజయవాడ), డాక్టర్‌ బీ.ఆర్‌.ప్రసాదరెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్, ధర్మవరం), మెంబర్‌ కన్వీనర్లు డాక్టర్‌ కె.వి.రమణారావు(రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌), బి.ఎస్‌.సెలీనా(లెక్చరర్, అకడమిక్‌ సెల్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీలలోని అకడమిక్‌ అఫైర్స్‌ డీన్లతో కమిటీ చర్చలు కొనసాగించింది. ఐదేళ్లక్రితం సీబీసీఎస్‌ విధానం ఎలా ప్రారంభించారు? ఇప్పుడెలా అమలవుతోంది? అన్న అంశాల్ని క్షుణ్ణంగా తెలుసుకుంది. ప్రస్తుత సీబీసీఎస్‌ విధానంలో మార్పులుచేర్పులు అవసరమా? అడ్వాన్సు చేయాలా? కొత్తగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా ఏయే నూతన అంశాల్ని సిలబస్‌లో చేర్చాల్సి ఉంటుందో అనే అంశాలను నివేదించారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు సబ్జెక్టు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు.

Related posts