telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో తక్కువ ధరకే ఇసుక.. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త విధానం!

jagan

ప్రస్తుతమున్న రేట్ల కన్నా ఏపీలో తక్కువ ధరకే ఇసుక లభించనుంది. సెప్టెంబర్‌ 5 నుంచి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమలు చేయనుంది. ఎండీసీ ద్వారా ఇసుక విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రేట్ల కన్నా తక్కువ ధరకే ఇసుక అందించాలని అధికారులకు జగన్‌ ఆదేశించారు. అలాగే ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. రీచ్‌ నుంచి స్టాక్‌యార్డుకు తరలింపునకు రశీదు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరే వరకు మరో రశీదు ఇవ్వాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని పేర్కొన్నారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. వినియోగదారుల కోసం యాప్‌, వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త విధానం వచ్చేవరకు ఇసుక అందించే బాధ్యత కలెక్టర్లదేనని ఆదేశించారు.

Related posts