telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఎస్వీబీసీ చానల్‌లో ఇక ప్రకటనలు ఉండవు: టీటీడీ

svbc channel

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఎస్వీబీసీ చానల్‌లో ఇక ప్రకటనలు ఉండవని స్పష్టం చేసింది. తమకు ఆదాయం కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని టీటీడీ పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)‌లో ప్రకటనలు విసుగు తెప్పించేలా ఉండడంతో భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చానల్‌ను ఇకపై యాడ్‌ఫ్రీగా మార్చాలని నిర్ణయించినట్టు టీటీడీ తెలిపింది.

తమకు ఆదాయ వనరుల కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాదు, చానల్ నిర్వహణకు భక్తులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని పేర్కొంది.  చానల్‌ నిర్వహణ కోసం భక్తుల నుంచి ఇప్పటికే రూ. 25 లక్షల విరాళాలు అందినట్టు తెలిపింది.

Related posts