telugu navyamedia
రాజకీయ వార్తలు

శివాజీ మహరాజ్ మనకు హీరో: యూపీ సీఎం యోగి

yogi adityanath

బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క సూచికను ఉంచబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో చారిత్రక పర్యాటక కేంద్రం ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నట్టు యోగి వెల్లడించారు. మొఘలాయిలను మన హీరోలుగా ఎందుకు ఉండనిస్తామని ప్రశ్నించారు. శివాజీ మహరాజ్ మనకు హీరో అని యోగి అభివర్ణించారు.

తన మూడేళ్ల పాలనలో యోగి పలు ప్రాంతాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. అలహాబాద్ పేరును ఆయన ప్రయాగ్ రాజ్ గా మార్చారు. 2015లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తాజ్ మహల్ కు సమీపంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ మ్యూజియంను, ప్రభుత్వం నిర్మించతల పెట్టింది. ఈ మ్యూజియంలో మొఘలుల సంస్కృతిని, వారి విలువైన వస్తువులు, చిత్రాలు, కళాఖండాలు, దుస్తులు, పాత్రలు, ఆయుధాలులను యోగి ప్రభుత్వం ప్రదర్శించనుంది.

Related posts