telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పుట్టినచోట కట్టడి… చైనాలో కొత్తగా ఒకే కేసు!

vuhan-china corona

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. డిసెంబరులో వెలుగుచూసిన ఈ వైరస్ మహమ్మారి చైనాను అతలాకుతలం చేసినప్పటికీ, దృఢసంకల్పంతో పోరాడిన డ్రాగన్ దేశం ఎట్టకేలకు కరోనాను కట్టడి చేసింది.

తాజాగా చైనాలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 1 మాత్రమే. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్ హెచ్ సీ) వెల్లడించింది. అది కూడా విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపింది. అంతకుమించి దేశంలో ఎక్కడా కొత్త కేసులు లేవని వివరించింది. చైనాలో ఇప్పటివరకు 82,875 కేసులు నమోదు కాగా, 77,685 మంది కోలుకున్నారు. 4,633 మరణాలు సంభవించాయి. అటు, కరోనా వైరస్ పురుడుపోసుకున్న వుహాన్ నగరంలో వరుసగా 28 రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

Related posts