telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆర్చర్ వేళ్ళ మధ్యలో గాజు ముక్క..

భారత్ తో టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రే ఆర్చర్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. జోఫ్రా ఆర్చర్‌ గాయంపై తాజాగా ఆష్లీ గైల్స్‌ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడాడు. ‘జనవరిలో భారత్ పర్యటనకు ముందు ఆర్చర్‌ తన ఇంట్లో ఫిష్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా గాయపడ్డాడు. అప్పుడు అతడి మధ్యవేలు తెగింది. గాయం కొద్దిరోజుల్లోనే నయమవడంతో భారత పర్యటనకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆర్చర్‌ టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడాడు. అయితే వన్డే సిరీస్‌కు ముందు అతడి మోచేతి గాయం ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్‌కు తిరిగి పంపించాం. సోమవారం జరిగిన శస్త్రచికిత్సలో ఆర్చర్‌ మధ్య వేలిలో గాజు ముక్క బయటపడింది’ అని గైల్స్‌ తెలిపారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి జోఫ్రా ఆర్చర్‌ మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అతడు కుడి మోచేతితో ఇబ్బందిపడుతున్నాడు. మధ్యలో గాయం తగ్గినా భారత్ పర్యటనలో మళ్లీ తిరగబెట్టింది. అయితే ఇప్పుడు ఆర్చర్ ఏప్రిల్ 9 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ ౨౦౨౧లో పాల్గొంటాడా… లేదా అనేది తెలియదు. ఐపీఎల్ లో ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించే విషయం తెలిసిందే.

Related posts