తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా జగన్ వ్యవహరిస్తున్నారని… కరోనా పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం అందరినీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ని విమర్శించేవాళ్ళు ఉండటం దురదృష్టకరమని… గాలి కబుర్లు, గాలి మాటలు చెప్తూ గాల్లో తిరిగే పేక్ ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై దాడులను ఇక ఉపేక్షించేది లేదని… సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అవటంతో దేవాలయాలపై దాడులు ఆపరా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి తన ఇష్ట దైవమని… తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదన్నారు. మతమార్పిడులు చేయించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని… హిందూ-ముస్లిం మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. రామతీర్థం ఘటన అమానుషమని.. రామతీర్థం పర్యటనకు అడుగడుగునా అడ్డుతగిలారని ఫైర్ అయ్యారు. తాను రామతీర్థం పర్యటన చేపట్టడంతో భయపడి తప్పించుకునేందుకు తమపై నిందలు వేశారన్నారు. 5 రోజులు రామతీర్థం ఘటన పట్టించుకోకుండా గడ్డి పీకారా అని ఫైర్ అయ్యారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..