telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

హైదరాబాద్ : స్కీమ్ కింద.. గిరిజనులకు ..ప్రముఖ విద్య సంస్థలలో ప్రవేశాలు..

huge job notification in telanganaf

ప్రముఖ విద్యాసంస్థల్లో బెస్ట్ అవెలబుల్ స్కీమ్ కింద ప్రవేశాల కోసం అర్హులైన గిరిజన (ఎస్టీ) విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారి ప్రకటించారు. 2019 -20 విద్యా సంవత్సరానికి గాను నాన్ రెసిడెన్షియల్ కోటాలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. వార్షికాదాయం రూ. 2 లక్షలకు మించని, హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులై ఉండాలని వెల్లడించారు.

జిల్లాలో 24 సీట్లు కలవని, 3వ తరగతిలో 11 సీట్లు, 5వ తరగతిలో 6 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు, చెంచులకు 2 సీట్లను కేటా యించామన్నారు. దరఖాస్తులు నాంపల్లి గాంధీభవన్ ఎదురుగా గల గృహకల్ప కాంప్లెక్స్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం లో ఉచితంగా లభిస్తాయని తెలిపారు.అలాగే మేడ్చల్ జిల్లాలో 12 సీట్లున్నాయని, ఇందులో 3వ తరగతిలో 7, 5వ తరగతిలో 3, 8వ తరగతిలో 2 సీట్లు కేటాయించడం జరిగిందని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో గిరిజన తెగలకు చెందిన లంబాడ, ఎరుకల, చెంచు కులాలకు చెందిన విద్యార్థిని/విద్యార్థులు విద్యా ర్థులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల ప్రాంత విద్యార్థుల రూ.1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చన్నారు

Related posts