telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ముకశ్మీర్ యువత కోసం లోక్ సభలో రిజర్వేషన్ల బిల్లు

kishan reddy minister

జమ్ముకశ్మీర్ లో యువత కోసం లోక్ సభలో రిజర్వేషన్ల బిల్లును హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ… చివరి నిమిషంలో కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. జమ్ములో అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో, కశ్మీర్ లో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.

మరోవైపు, ఆధార్ చట్ట సవరణ బిల్లు 2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. ఆందోళనల మధ్యే ఈ బిల్లుపై రవిశంకర్ ప్రసాద్ ప్రసంగం చేశారు. అనంతరం ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణ బిల్లును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.

Related posts