రాజకీయ లబ్ధి కోసమే పోలీసు శాఖపై చంద్రబాబు నిందలు వేస్తున్నారని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన పోలీసులే ఇప్పుడూ కొనసాగుతున్నారని ఆమె స్పష్టం చేశారు.గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి గర్భంలో శిశువుకు ఎంత రక్షణ ఉంటుందో, అలాంటి రక్షణ ఇప్పుడు ఏపీలో ప్రజలకు ఉందన్నారు. దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని తెలిపారు. ఇలాంటి సంఘటన రాష్ట్రంలో జరగకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆపద వస్తే దిశ యాప్, చట్టాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.