telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ సినిమాలను బాలీవుడ్ థియేటర్లు బ్యాన్ చేశాయట…!

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో  పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కొన్నిసినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ను నమ్ముకొని విడుదల అయ్యాయి. అయితే ఈసినిమా షూటింగ్ లకు అనుమతులు రావడం, థియేటర్స్ కూడా త్వరలో ఓపెన్ అవుతుండటంతో సినిమా ఇండస్ట్రీకి తిరిగి కళ వచ్చింది. ఇక దసరాను టార్గెట్ చేశారు స్టార్ హీరోలు. దాదాపు 7 నెలలుగా తమ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు సార్ప్రైజ్ ఇచ్చేందుకు  దసరాను టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఈ కరోనా సమయంలో ఓటీటీ విడుదలైన సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయాలనీ చూస్తున్నారు. కానీ అందుకు బడా థియేటర్ సంస్థలు ఒప్పుకోవడం లేదు. రీసెంట్ గా ఓటిటి రిలీజ్ కాబడిన “దిల్ బెచారా”, “శకుంతలా దేవి”, “సడక్ 2” “ఖుదా హఫీజ్” అలాగే “గుంజాన్ సక్సేనా”, “గులాబో సితాబో” వంటి బాలీవుడ్ బిగ్ సినిమాలను ప్రముఖ మల్టీ ప్లెక్సులు అయిన పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్ వంటి వారు బ్యాన్ చేసారు. తమ మల్టీ ప్లెక్సులలో ఈ సినిమాలను విడుదల చేయము అని తెలుపుతున్నాయి.

Related posts