దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సూత్రదారి హైదరాబాద్‌కు చెందిన తీవ్రవాదిగా గుర్తించారు. 2018లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలో సదరు ఉగ్రవాది పట్టబడ్డాడు. అతడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేసు తీవ్రత కారణంగా జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉంటూనే ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు బోధిస్తన్నట్టు ఎన్ఐఏ విచారణలో స్పష్టమైంది.
తీహార్ జైలు నుంచి ఉగ్రవాదిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. విచారణలో ఉగ్రదాడుల విషయాన్ని తీవ్రవాది బయటపెట్టినట్టు తెలుస్తోంది.సీఏఏ వ్యతిరేక ఆందోళనల ద్వారా దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై ఐసిస్ ఇరాన్ ఖొరాసన్ మాడ్యూల్‌కు చెందిన జహంజేబ్ సమీ, హింద్రా బషీర్‌బేగ్ జంటను గత నెల 8న ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటను విచారించగా హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించిన ఉగ్రవాది సమాచారం వెలువడినట్టు తెలుస్తోంది.