భారతీయ సినీ నట దిగ్గజం రిషి కపూర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయనకు సినిమాలు, భారత అభివృద్ధి కార్యక్రమాలు అంటే మక్కువ ఎక్కువ ఆయన మృతితో కలత చెందానని ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్ఫూర్తివంతమైన మనిషి, చురుకైన వ్యక్తి. ఆయన టాలెంట్‌కు పవర్ హౌస్ లాంటి వారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో చేసిన చర్చ, ఆయనను స్వయంగా కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను’ అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.