కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చిదంబరాన్ని అరెస్టు చేసింది. ప్రస్తుతం చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఇడి బృందం బుధవారం ఉదయం తీహార్ జైలుకు చేరుకుని ఆయనను గంటపాటు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని ప్రశ్నించాలని ఇడి చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు అంగీకరించిన ఒక రోజు తరువాత చిదంబరాన్ని అరెస్టు చేశారు.
చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ కూడా బుధవారం జైలుకెళ్ళి ఆయనను కలుసుకున్నారు. అనంతరం కార్తీ మాట్లాడుతూ తన తండ్రి ఏమాత్రం నిరుత్సాహానికి లోనుకాలేదని చెప్పారు.