ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. తాజాగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హిలేరియస్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ.. దేవదాసు పాత్రలో కనిపించనున్నాడు. డ్రింకర్ ఎందుకు అయ్యాడు ? ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు వంటి అంశాలని చాలా ఆసక్తికరంగా చూపించనున్నారట. అక్టోబర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. మూడు పాటలను యూరప్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “ఇన్పించుకోరా…” అనే లిరికల్ వీడియోస్ ఒంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
previous post