telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పంచాయతీ ఎన్నికలే… వైసీపీ పతనానికి నాంది..

chandrababu tdp

నిన్నటితో ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత పూర్తయింది. అయితే.. ఈ రెండో విడతలో టీడీపీ బాగానే పుంజుకుంది. ఏకంగా కొడాలి నాని స్వంత గ్రామంలోనే వైసీపీ పరాజయం చవి చూసింది. రెండో విడతలోనూ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికల్లో అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్సెంటివ్‌, నల్లచట్టం, బలవంతపు ఏకగ్రీవాలతో భయపెట్టాలని వైసీపీ చూస్తోందన్నారు. ఎర్రచందనం, లిక్కర్‌ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని… వైసీపీకి ఓట్లు వేయించాలని వాలంటీర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారని ఫైర్‌ అయ్యారు చంద్రబాబు. తొలిదశలో 39.52 శాతం టీడీపీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో గెలిచారని.. టీడీపీ చొరవ వల్లే 82 శాతం ఓట్లు పోల్‌ అయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ నేతలు చీకటి రాజకీయాలకు తెరతీశారని.. రాత్రి 10 గంటల వరకు టీడీపీకి మెజార్టీ వచ్చింది.. తర్వాత పరిస్థితి మారిందన్నారు. రాత్రి పూట ఎందుకు ఓట్ల లెక్కింపు చేస్తున్నారని.. కౌంటింగ్‌ కేంద్రాల్లో రాత్రిళ్లు ఎందుకు కరెంట్‌ కట్‌ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని చంద్రబాబు మండిపడ్డారు.

Related posts