telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ప్రణయ కాంతా!!

sugatri poetry corner
ఓరచూపులతో
నా గుప్పెడు మనసుకు 
గాలమేస్తావు
మందహాసంతో నా మదిని
మాయచేస్తావు
కవ్వించే కళ్ళతో చూపుల చెరలో
ప్రేమ ఖైదీని చేస్తావు
సిగ్గుతో ఎరుపెక్కిన
మందార మొగ్గల బుగ్గలతో
మనసును దోస్తావు
తేనెవంటి పలుకులతో
ప్రేమ విందు చేస్తావు
కందిరీగ నడుముతో
మనసు మైదానంలో
నాట్యమే చేస్తావు
పురివిప్పిన మయూరంలా,
సప్తవర్ణాల ఇంద్రధనుస్సు లా
అందాలన్నీ ఒలకబోస్తావు
నా నయనాల ఛాయాగ్రహంలో…
ప్రణయ కాంతా!
వలపుల వసంతమా!
“ధన్యోస్మి!”…………
—గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts