telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

సీఎం యోగి టెన్షన్ పడుతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో 2013 సంవత్సరంలో  మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో 38 మంది నిందితులపై కేసులను ఎత్తివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు దీన్ని కీలక నిర్ణయంగా అభివర్ణించడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. 
ఈ నిర్ణయం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని వ్యాఖ్యానించారు. తాను ఊహించినట్లు హిందుత్వ నినాదం పనిచేయడం లేదని సీఎం యోగి టెన్షన్ పడుతున్నారు. ముజఫర్ నగర్ అల్లర్ల సందర్భంగా మర్డర్, మానభంగాలతో చితికిపోయిన బాధితులకు న్యాయం జరగాలి. ప్రస్తుతం దేశంలో హిందూయిజం,  ఇస్లాం ప్రమాదంలో లేవు. న్యాయం మాత్రమే ప్రమాదంలో ఉంది’ అని ట్వీట్ చేశారు.

Related posts