telugu navyamedia
రాజకీయ వార్తలు

రఫెల్‌ విమానంలో చక్కర్లు కొట్టిన రాజ్‌నాథ్‌

Rajnath Singh inaugurates NIA office

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకున్నారు. బోర్డియాక్స్‌లోని దస్సాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దసరా సందర్భంగా ముందుగా ఆయుధ పూజ చేసిన రాజ్‌నాథ్‌ తరువాత రిబ్బన్‌ కత్తిరించి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని లాంఛనంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రాన్స్‌లోని డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి తొలి యుద్ధ విమానం రఫేల్‌ను స్వీకరించి 25 నిమిషాలపాటు విమానంలో చక్కెర్లు కొట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్‌ సోనిక్‌ వేగంతో తాను ప్రయాణిస్తానని కలలో కూడా ఊహించలేదని, రఫేల్‌లో విహారం చాలా సౌకర్యవంతంగా ఉందన్నారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఒక్కసారే వస్తాయన్నారు. రఫేల్‌ రాకతో దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని చెప్పారు. 2021 నాటికి 18, 2022 నాటికి మొత్తం 36 రఫేల్‌ జెట్లు భారత్‌ అమ్ముల పొదిలో చేరుతాయన్నారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని కొనియాడారు.

Related posts