telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“ఎన్నిక “

అది “ఎన్నిక “అంటే పొరపాటు.
అదీ..”పేరెన్నిక “
ఎన్నో వ్యయ ప్రయాశల కోర్చి..
జన సమీకరణాలు పేర్చి,
సేవకులం అంటూ..సేవికలం అంటూ
సాహసితో ఒక సాహసి చేసే..
రాజ్యాంగ బద్ద యుద్ధం..
అది ఎన్నిక అంటే పొరపాటు..
అదీ పేరెన్నిక..!
నోటి తో ఒకరు,నోట్ల తో ఒకరు..
సేవ తో ఒకరు,చేరువ తో ఒకరు.
అను నిత్యం అందుబాటు తో
అనుసరించే వారికి…అందించే అందలం
అది ఎన్నిక కాదు పేరెన్నిక..
కులం మాటున ఒకరు,
కుతంత్రం మాటున ఒకరు.
మతం మాటున ఒకరు
మమతల మాటున ఒకరు.
బంధుప్రీతిన ఒకరు..బంధం మాటున ఒకరు.
చివరకు మనసు దోచుకున్న వారిదే..
ఎన్నిక…పేరెన్నిక..
మతలబులున్నా..
మనసు దోచుకున్న వారే మిన్న.
నోట్ల తో పాట్లు ఉన్నా..
మందుతో విందులున్నా…
అవి ఉత్సాహానికే ననీ.. ఉవాచ..
ఎన్నైనా..ఎన్నున్నా..నిత్యా సేవకులకు
దక్కేదే.. ఈ ఎన్నిక…పేరెన్నిక..

Related posts