తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో నిందితులను నేడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 6 గురు నిందితులను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు నిందితులను ప్రశ్నిస్తారు. వీరంతా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.
previous post
next post
గత పాలనలో అన్ని వ్యవస్థలూ పట్టాలపై పరుగులు: నారా లోకేశ్