అమెరికా నుండి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. 2020 మే నెలలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ నిర్వహించనున్న వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం పంపారు. దాదాపు వెయ్యి మంది సాగునీటి, పర్యావరణ నిపుణులు హాజరుకానున్న ఈ సదస్సుకు హాజరుకానున్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరించనున్నారు.
ఈ ప్రఖ్యాత సదస్సులో కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రసంగం చేయనున్నారు. 2017లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరిగిన సదస్సుకు కేటీఆర్ హాజరవగా ఇప్పుడు మరోసారి హాజరై కాళేశ్వరం గురించి వివరించనున్నారు.