తాజాగా భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాక్కున్న ఉగ్రమూకలపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన అమెరికా, తమ మద్దతు ఇండియాకే నని, వారు దాడిచేసింది ఉగ్రమూకలపైనే తప్ప పాక్ పై కాదని, ఈవిషయాన్ని పాక్ కూడా అర్ధం చేసుకొని ప్రతిదాడులు మరిచి, దేశంలో ఉన్న ఉగ్రశిబిరాలపై దాడులు చేయాలనీ సూచించింది. అలా కాదని ప్రతిదాడికి దిగితే తాము భారత్ వైపే అంటూ హెచ్చరించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మైకేల్, ఈ ఉదయం పాక్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. తక్షణం పాక్ గడ్డపై ఉన్న అన్ని ఉగ్రవాద శిబిరాలనూ నాశనం చేయాలని ఆయన కోరారు. ఇండియాపై మిలటరీ చర్యలకు దిగాలన్న ఆలోచన వద్దని, అదే జరిగితే, తాము కూడా ఏమీ సాయం చేయలేమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తొలగేందుకు చర్చించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సమాజం చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఏకాకిగా నిలవవద్దని కోరారు.