telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చి(ని)రుద్యోగి కష్టాలు

ఎంత కష్టం ఎంత కష్టం

ప్రైవేట్ చిరుద్యోగికి ఎంత కష్టం

జీతభత్యం లేకపాయే

ఇల్లు అద్దెకట్టక ఆగమాయే

కరెంటు బిల్లు మోపెడాయే

పత్యం ఉండుడు రాకపాయే

 

ఎంత కష్టం ఎంత కష్టం

ఉద్యోగం ఊడిపోయే

నిరుద్యోగం నింగినంటే

తిండి గింజలు నిండుకుండే

బతకలేడు మిన్నుకుంటే

ఇగ చస్తడేమో తన్నుకుంటూ

 

ఎంత కష్టం ఎంత కష్టం

చిరుద్యోగికి ఎంత కష్టం

ముట్టలేడు అవసరం ఉన్నా

పట్టలేడు పనితనం తెలిసిన

దేనిమీద ఆశ లేదు

తుమ్మితే పోయే ప్రాణం మీద తప్ప…

 

కావాలి నేడు కడుపు నింపే కాస్త పని

ఊరటనిచ్చే చిన్నపని

జీతం ఇచ్చే చిన్నపని

ఇగ పస్తులుండుడు కానిపని

 

 

Related posts