telugu navyamedia
క్రీడలు వార్తలు

బ‌యో బ‌బుల్‌ దాటినా కివీస్ ప్లేయర్స్…

డబ్ల్యూటీసీ టైటిల్‌ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాంపియన్‌షిప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఫైన‌ల్స్‌కు ముందే ఓ భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జ‌ట్టులోని ఆరుగురు ఆట‌గాళ్లు కరోనా నిబ‌ధ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి బ‌యో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారని సమాచారం తెలుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ప్లేయర్స్ సౌథాంప్టన్‌లోని ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే కొంతమంది న్యూజిలాండ్ ప్లేయర్స్ బయో బబుల్ నిబంధనలను విస్మరించి ఉదయం గోల్ఫ్ ఆడటానికి వెళ్లారని క్రిక్‌బజ్ పేర్కొంది. దీనిపై భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళన వ్య‌క్తం చేస్తోంది. ఈ విషయం గురించి ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధ‌మైంద‌ని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఉదయం వేళ‌ గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని క్రిక్ బ‌జ్ త‌న నివేదికలో పేర్కొంది. ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టే అని భారత జట్టు మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేయనున్నారట. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బ‌యో బ‌బుల్‌ను వీడి బ‌య‌ట‌కు వెళ్లిరావ‌డం ప‌ట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతున్న‌ది.

Related posts